telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా బారినపడి కోలుకున్న వారికి ఒక్కడోస్ వ్యాక్సిన్..

Corona Virus Vaccine

దేశంలో క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేష‌న్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టి వ‌ర‌కూ 49 ల‌క్ష‌ల‌మందికి పైగా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.  నిన్న‌టి నుంచి రెండో ద‌శ వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అమెరికాలో ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలు అందుబాటులోకి వచ్చాయి.  అయితే, అయితే వ్యాక్సిన్ ఒక్క డోసు ఇవ్వాలా లేదంటే రెండు డోసులు ఇవ్వాలా అనే దానిపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.  శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలను బట్టి డోసులు ఇవ్వాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  కరోనా బారినపడి కోలుకున్న వారికి ఒక్కడోస్ వ్యాక్సిన్ ఇచ్చినా సరిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల శరీరంలో యాంటీబాడీలు అప్పటికే ఉత్పత్తి అయ్యి ఉంటాయి.  వ్యాక్సిన్ ఒక్కడోస్ ఇవ్వడం వలన మరికొన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.  అయితే, కరోనా బారిన పడకుండా ఉన్న వ్యక్తులకు ఒక్క డోస్ వ్యాక్సిన్ సరిపోదని, రెండు డోసులు వ్యాక్సిన్ లు ఇవ్వాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  ఇక భారత్ లో వ్యాక్సిన్ తీసుకున్న 49ల‌క్ష‌ల మందిలో 8,563 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇందులో 19 మంది మృతి చెందారు.  అయితే, మ‌ర‌ణించిన 19 మంది క‌రోనా టీకా విక‌టించ‌డం వ‌ల‌న మ‌ర‌ణించ‌లేద‌ని, ఇత‌ర జ‌బ్బుల కార‌ణంగానే మృతి చెందార‌ని నిపుణులు చెప్తున్నారు.

Related posts