telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఒంటిపై నూలు పోగు లేకుండా… సైకిల్ రైడింగ్…!!

Naked

దక్షిణ ఫ్లోరిడాలోని విల్టన్ డ్రైవ్ 6th అవెన్యూలో కొందరు స్థానికులు ఓ వ్యక్తి నగ్నంగా సైకిల్‌పై వెళ్తుండడం చూశారు. ఆ వ్యక్తి స్థానికంగా ఉండే రాక్‌హార్డ్ లవ్‌స్టఫ్ అనే షాపుకు వెళ్లి రెండు జతల లోదుస్తులు కొనుక్కున్నాడు. అనంతరం వాటిలో ఒకటి వేసుకొని సైకిల్‌ను షాప్ వద్ద వదిలిపెట్టి బయటకు వచ్చాడు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన ఆయన కొద్ది సేపటి తరువాత వేసుకున్న అండర్ వీయర్‌ను తీసేశాడు. ఆ తరువాత కొద్దిసేపు అటు ఇటూ తిరిగుతూ తనను తాను ఎక్స్‌ఫోజ్ చేయడం ప్రారంభించాడు. అది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే.. నాకు బట్టల్లేవు షాపింగ్‌కు వచ్చానని, తన పేరు మైఖేల్ జాక్సన్ అని చెప్పాడు. ఇక బట్టల షాపుకు వెళ్లిన అతడు లోదుస్తులు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా తన సైకిల్ ఉంచుకోమని అక్కడి నుంచి వచ్చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక అతడి పేరు మైఖేల్ జాక్సన్ కాదని, జాన్ స్మిత్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడ్ని కటకటాల్లోకి నెట్టారు.

Related posts