telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న అజారుద్దీన్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.

రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు సమాచారం అందజేశారు.

అజారుద్దీన్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ గవర్నర్‌ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం లేఖ రాసింది. దీంతో అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.

 

Related posts