హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ఈ రోజు ప్యానెల్ సభ్యులతో కలిశారు. బుద్ధభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువత నైపుణ్యాన్ని గుర్తించి క్రికెట్‌లోకి తెస్తామని అన్నారు.
క్రికెట్‌కు ప్రభుత్వ సహకారం అందించాలని కేటీఆర్‌ను కోరినట్లు తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి సహకారం కోరతామన్నారు. పార్టీలకతీతంగా అందర్నీ కలిసి సహకారం కోరతామని వెల్లడించారు. పార్టీ మార్పు విషయం పై ఆయన స్పందించలేదు. కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు అజారుద్దీన్ తెలిపారు.