telugu navyamedia
రాజకీయ

సీడబ్ల్యూసీ కీలక భేటీ..

కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడానికి ప్లాన్‌ వేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ వ‌ర్గాలు స‌మాచారం. ఈ స‌మావేశంలో పార్టీ అధినేత్రి సోనియాతో పాటు రాహుల్‌, కాంగ్రెస్‌ అగ్రనేతలంతా పాల్గొననున్నారు.

ఈ భేటిలో ప‌లు అంశాలు చ‌ర్చ‌లు రానున్న‌ట్ల తెలుస్తుంది..కాంగ్రెస్‌కు పార్టీ కి తాత్క‌లిక అధ్యక్షుడి ఎన్నికతో పాటు..పార్టీ సంస్థాగత ఎన్నికలు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Breaking news live updates: Congress Working Committee meets to discuss  organizational polls, political situation - The Times of India

పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్‌ పరిణామాలపై ఇటీవల జీ-23గా పేర్కొనే కాంగ్రెస్‌ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్ఠానంపై బహిరంగంగా విమర్శలు చేసిన అంశాలూ చర్చకు రానున్నాయి.

అంతేకాకుండా సోనియాగాంధీకి పార్టీలో అధ్యక్షుడు లేకపోవడంతో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏం జరుగుతుందో తెలియటం లేదంటూ జీ23 గ్రూప్ నేత‌లు లేఖ రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Related posts