telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ధర్మాన్ని పరిరక్షించేలా సుప్రీం తీర్పు: పవన్ కల్యాణ్

pawan-kalyan

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు వెలువరించిన ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ధర్మాన్ని పరిరక్షించేలా తీర్పు ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు భారతీయులుగా తామందరం హృదయపూర్వక సమ్మతి తెలుపుతున్నామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. సాంత్వన కలిగించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వచ్ఛమైన విజ్ఞతకు దర్పణం పడుతోందని పవన్ వ్యాఖ్యానించారు. చివరగా ‘భారత్ మాతా కీ జై’ నినాదంతో ట్వీట్ ముగించారు.

Related posts