telugu navyamedia
రాజకీయ

దేశంలో త‌గ్గ‌తున్న‌ క‌రోన మహమ్మారి ఉధృతి..

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ త‌రువాత‌.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం ప‌ట్టింది. గత కొద్ది రోజులుగా 30 వేలకుపైనే నమోదవుతోన్న కరోనా కొత్త కేసులు నిన్న కాస్త తగ్గాయి. 13.6 శాతం మేర తగ్గి.. 26 వేలకు పడిపోయాయి. అలాగే 200కు పైగా మరణాలు సంభవించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 26,115 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 252 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మ‌రో 34,469 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌ర‌ణాల సంఖ్య 4,45,385కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కు చేరింది.

coronavirus latest live news, covid19 live tracker

ఇక‌.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81,85,13,827 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 96,46,778 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

Related posts