telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జనగామ జిల్లాలో ఆటో బోల్తా… ఒక్కరు మృతి

ఆటోల గురించి అందరికి తెలుసు. ఎంత మంది దొరికితే అంత మందిని లోపల కుక్కి డ్రైవింగ్ చేస్తారు డ్రైవర్లు. అలా అధిక లోడ్ తో వెళుతున్న ఆటో బోల్తా పడి ఒక్కరు చనిపోగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డ ఘటన జనగామ జిల్లా చోటు చేసుకుంది నిబంధనలకు విరుద్ధంగా. 14 మందితో వెళుతున్న ఆటో అదుపు తప్పు బోల్తా పడడంతో 13 మందికి తీవ్ర గాయాలు కాగా ఒక్క మహిళ అక్కడికి అక్కడే మృతి చెందింది. జనగామ జిల్లా బచ్చన్న పెట్ మండలం. తమ్మల పల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు లింగాల ఘనపూర్ లోని కిష్ట గూడెం లో పత్తిని వేరేందుకు ఒక ఆటోలో వెళుతున్నారు. అధిక లోడ్ తో ఉన్న ఈ ఆటో నెల్లుట్ల దగ్గర ప్రమాద వశాత్తు అదుపు తప్పి పడిపోవడంతో ఒక్కరు అక్కడికి అక్కడే మృతి చెందగా. ఈ ఆటోలో ప్రయాణిస్తున్న మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే స్థానికులు. జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించడంతో వారికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఈ ఘటన పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts