ప్రభుత్వం ఎలాంటి ప్లానింగ్ లేకుండా లాక్ డౌన్ ప్రకటినచ్చిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. లాక్ డౌన్ ను ప్రకటించే ముందు మోదీ ఏమాత్రం ఆలోచించలేదన్నారు. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. లాక్ డౌన్ భయంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వలస కార్మికుల్లో ఎక్కువ మందికి రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేవని ఒవైసీ చెప్పారు. ఇలాంటి వారికి ఆధార్ నంబర్ ఆధారంగా సాయం చేయాలని సూచించారు. గోడౌన్లలో నిలువ చేసిన బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు. తెలంగాణ నుంచి ఛత్తీస్ గఢ్ కు బయల్దేరిన 12 ఏళ్ల అమ్మాయి 100 కిలోమీటర్లకు పైగా నడిచి చివరకు కన్ను మూసిందని అన్నారు. సొంత ఇళ్లకు చేరుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత వలస కార్మికుల పరిస్తితి ఏమిటని ఒవైసీ ప్రశ్నించారు.


రాజధానిపై స్పష్టత లేకుండా బొత్స మళ్లీ ఏదేదో మాట్లాడారు: టీడీపీ నేత సోమిరెడ్డి