telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ పై అర్ధరాత్రి దాడి

Repablic TV Editor Gopiswamy

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై గత అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళుతున్న వేళ, ఈ ఘటన జరిగిందని అర్నబ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆయన ఆరోపించారు.రాత్రి 12.15 గంటల సమయంలో ఇంటికి బయలుదెరుతుండగా మా కారును రెండు బైక్ లు వెంబడించాయని ఆయన తెలిపారు. కారు అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఆ వెంటనే నేను కారును మరింత వేగంగా అక్కడి నుంచి పోనిచ్చాను. నా కారు వెనకే వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకున్నారని తెలిపారు.

ఆపై నా సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడగా యూత్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారని చెప్పారు. తమ నేతలు చెప్పినందునే దాడి చేసేందుకు వచ్చామని వారు అంగీకరించారని కూడా అర్నబ్ వెల్లడించారు. ఆపై తాను సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. తనపై దాడికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ, ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

Related posts