టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్రవేశించి దశాబ్దం కావొస్తున్నా ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తూ అవకాశాలు అందుకుంటోంది. రకుల్ “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో తెలుగు వారికి దగ్గరైంది. ఆ తరువాత ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే తాజాగా బాలీవుడ్ ఆశలతో ఎదురుచూస్తున్న రకుల్ మరో క్రేజీ ఆఫర్‌ను పట్టేసింది. తాజాగా ఈ భామ మరో బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ రకుల్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాల్లోనే నటించింది. తొలిసారిగా సోలో హీరోయిన్‌గా ఈ సినిమాలో నటించనుందట. మహిళా దర్శకురాలు కశ్వీ నాయర్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ ఆజ్ కల్ తరహా లవ్ స్టోరిగా తెరకెక్కనుందట. ఈ సినిమాలో యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో జత కట్టేందుకు రెడీ అవుతోంది రకుల్. గ్లామర్ షోత అవకాశాలు సాధించిన రకుల్ ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకుంటుందేమో చూడాలి. త్వరలో ఈ భామ తెలుగులో నితిన్, చంద్ర శేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.
previous post

