telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్… “సాహో” కలెక్షన్స్ ఫేక్…!?

Saaho

ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. సుజిత్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మాతలు. ‘సాహో’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను నిరాశ పరిచింది. సినిమాకు వచ్చినంత హైప్ కంటెంట్‌లో ఏమీ లేదని అన్నారు. కలెక్షన్ల పరంగా సాహో ఎలా ఉన్నప్పటికీ ఆడియన్స్ రేటింగ్ మాత్రం నిరుత్సాహపరిచింది. ఈ సినిమా హిందీలోనే కాదు తమిళం, మలయాళంలోనూ విడుదలైంది. అయితే సాహో హిందీ వెర్షన్ కలెక్షన్లు తప్పని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ దాదాపు రూ.143 కోట్లు వసూలు చేసినట్లు మొదట్లో సినీ విశ్లేషకులు తెలిపారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదట. ఫైనల్ రన్‌లో సాహో హిందీ వెర్షన్‌కు వచ్చిన వసూళ్లు రూ.126 కోట్లేనట. ‘సాహో’ ఫేక్ కలెక్షన్స్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కేఆర్కే 143 కోట్లు తప్పన్నాడు. రియల్‌గా ‘సాహో’ వసూలు చేసింది 126 కోట్లేనట. అంటే, 17 కోట్ల మేర అబద్ధపు ప్రచారం జరిగిందన్నమాట. ఇలాగే, శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన మరో సినిమా ‘చిచోరే’ కూడా కేఆర్కే హిట్ లిస్ట్‌లో పడింది. ఆ సినిమా వాళ్లు 152 కోట్లని చెబుతోంటే ఇతను మాత్రం 125.50 కోట్లు వచ్చాయని బల్లగుద్దుతున్నాడు. అంతే కాదు, ‘మణికర్ణిక, గల్లీబాయ్, బద్లా, కేసరీ, దే దే ప్యార్ దే, భారత్, మిషన్ మంగళ్, వార్’ ఇలా దేన్నీ వదల్లేదు కేఆర్కే. అయితే, ఈ సంఖ్యలన్నీ ఇయనకు ఎలా తెలిశాయంటే మాత్రం సరైన సమాధానం లేదు. కమాల్ ఆర్ ఖాన్ గత పబ్లిసిటీ జిమ్మిక్కులు తెలిసిన బాలీవుడ్ వారెవరూ ఈ రియల్ అండ్ ఫేక్ కలెక్షన్ల హల్ చల్‌ని సీరియస్‌గా తీసుకోవటం లేదు. ఎందుకంటే, కేఆర్కేనే అసలు ఫేక్ అనేది వారి అభిప్రాయమట. కేఆర్కే అంటే … కమాల్ ఆర్ ఖాన్. ఇతను అప్పుడెప్పుడో ఓ సినిమా చేశాడు. ఇక ఆ తరువాత ఎప్పుడు పడితే అప్పుడు ట్విట్టర్‌లో అవాకులు చవాకులు పేలుతుంటాడు. మోదీతో సహా ఎవర్నీ వదిలిపెట్టడు ఈ పబ్లిసిటీ స్టంట్ మాస్టర్.

Related posts