కరోనా మహమ్మారి బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ తన తల్లి దులారికి కొద్ది పాటి కరోనా లక్షణాలు కనిపించాయని పేర్కొన్నాడు. సోదరుడు, వదిన, మేనకోడలు కూడా కరోనా బారిన పడ్డారని స్పష్టం చేశాడు. తాజాగా వీరు కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో తన ఫ్యామిలీ కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. దులారి కోలుకోవడంపై పలువురు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ తదితరులు కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవర పరుస్తోంది.
previous post