telugu navyamedia
ఆరోగ్యం

నానబెట్టిన బాదం పప్పు తింటే కలిగే ప్రయోజనాలు

నానబెట్టిన బాదం పప్పులో అద్భుతమైన పోషకవిలువలున్నాయి. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోడం వల్ల ఎన్నో లాభాలను పొందచ్చు. బాదం పప్పు ఒమేగా 3, విటమిన్ ఇ, ప్రొటీన్, పీచుతో నిండి ఉంటుంది. దీని పోషకాహార విలువలని బట్టి సూపర్ ఫుడ్ అనొచ్చు. ఇందులో ఉన్న ప్రొటీన్ కారణంగా తొందరగా ఆకలి వేయదు. మెగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి, ఇంకా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు, రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. రోజూ నానబెట్టిన బాదాం పప్పులు తినడం చాలా మంచిది. ఎందుకంటే బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. కాబట్టి మనం తిన్న బాదం మనకి మేలు చేస్తుంది. బాదం పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే వాటిని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నానబెట్టిన బాదం వలన ప్రయోజనాలు ఏమంటే ఈ పప్పులో లిపేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది – బాదాం పప్పులు తొందరగా ఆకలి కానివ్వవు. కాబట్టి అప్పుడప్పుడూ అవి తింటూ ఉండడం వల్ల త్వరగా ఆహారం మీదకి మనసు మళ్ళకుండా ఉంటుంది. దీంతో బరువు తగ్గడం కూడా తేలిక. గుండె ఆరోగ్యానికి కూడా బాదం చాలా మంచిది. అది చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. బాదం లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి వయసు కనపడనివ్వకుండా చేస్తుంది. కాన్సర్ తో పోరాడుతుంది.నానబెట్టిన బాదం లో ఉండే విటమిన్ 17 కాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. నానబెట్టిన బాదం లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు. గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంది.

Related posts