అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. కొమ్మినేనిని విజయవాడకు తరలిస్తున్నారు.
అక్కడి నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తారని సమాచారం. ఆపై గుంటూరు లేదా మంగళగిరి కోర్టులో కొమ్మినేని హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.