telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం ఏపీ కేబినెట్ నిర్ణయం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం అందించడమే కాకుండా ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్ కు పదోన్నతి కల్పించి, గ్రూప్2 స్థాయి డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ విషయాన్ని మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.

Related posts