telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్‌ మూవీలో అనుష్క…! క్లారిటీ ఇచ్చేసింది

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే పరశురామ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతుండటం తో తిరిగి సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. కొంత మంది హీరోలు మాత్రం ఇప్పట్లో షూటింగ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా ఇప్పట్లో షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో లేరని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇటీవలే ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. సర్కారు వారి పాటలో జేజెమ్మ అనుష్క నటించబోతుందని ఓ వార్త వైరల్‌ అయింది. అయితే.. దీనిపై క్లారిటీ వచ్చింది. ఆ వార్తలో నిజం లేదని.. ఈ మూవీలో అనుష్క నటిస్తుందన్న ప్రచారం అవాస్తవమని తేలింది. కాగా.. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా నటించబోతుంది.

Related posts