telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

టీ20 ప్రపంచ కప్ వాయిదా

T20

టీ20 ప్రపంచ కప్ విషయంలో ఊహించిందే జరిగింది. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్యలో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచ కప్ ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. సోమవారం ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్ళలో వరుసగా నిర్వహించనున్న వరల్డ్ కప్ షెడ్యూల్ ను కూడా ఐసీసీ ప్రకటించింది. 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2021అక్టోబర్-నవంబర్ మధ్య, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరుగుతుంది. 2022 టీ20 ప్రపంచ కప్ పోటీలు అక్టోబర్-నవంబర్ మధ్య, ఫైనల్ నవంబర్ 13న జరుగుతుంది. 2023 టీ20 ప్రపంచ కప్ 2023 అక్టోబర్ -నవంబర్ మధ్య, ఫైనల్ నవంబర్ 26న జరుగుతుంది. టీ20 ప్రపంచ కప్ వాయిదాపై అధికారిక ప్రకటన రావడంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైంది. విదేశాల్లో టోర్నీ నిర్వహణపై త్వరలో బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related posts