అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కోన వెంకట్ – విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ భాషాలోను తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనుష్క శెట్టితో పాటు తమిళ నటుడు మాధవన్, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి వంటి తారలు నటిస్తున్నారు. ‘నిశ్శబ్దం’ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటిసారి అనుష్క మూగ పాత్రలో నటిస్తుండటం, మాధవన్ వంటి యాక్టర్ ఓ పాత్రను పోషించడంతో నిశ్శబ్దంపై అంచనాలు పెరిగాయి.
అది అలా ఉంటే ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్‌లో విడుదలకాలేకపోయింది. అయితే ఒకవేళా లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత సినిమాలను చూడటానికి థియేటర్స్ కి జనాలు ఎంతవరకూ వస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. దీంతో కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘నిశ్శబ్దం’ సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. ఏప్పుడో విడుదలకావాల్సిన సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోయేసరికి నెలకి లక్షల్లో వడ్డీలు కట్టుకుంటున్నారట నిర్మాతలు. కారణం అమెజాన్‌కు ఈ సినిమాను అమ్మాలంటే అనుష్క అనుమతి కూడా కావాలట. కానీ ఆమె మాత్రం డిజిటల్‌లో విడుదలకు అంగీకరించడం లేదట. దాంతో వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారట నిర్మాతలు. అంతేకాదు ఈ విషయంలో ఆమె తీరు పట్ల అసహనంతో వ్యక్తం చేస్తున్నారట నిర్మాతలు.