నగరంలోని బంజారాహిల్స్‌లో ఘోరం చోటుచేసుకుంది. సయీద్ నూర్ అనే రౌడీషీటర్‌ను నలుగురు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అనంతరం నిందితులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటనకు పాతకక్షలే కారణంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే బహిరంగ హత్యలు అనేకం జరగటంతో నగరంలో ప్రజలు ఆందోళనకు గురిఅవుతున్నారు. ఒకపక్క సీసీ కెమెరాలు, మరోపక్క చుట్టూ ప్రజలు, పోలీసులు, అయినా నడిరోడ్డుపైనే నగరంలో హత్యలు జరుగుతుండటం తో ప్రజలు కూడా అభద్రతా భావానికి గురిఅవుతున్నారు. ఈ తరహా రక్షణ వ్యవస్థ ఉండటంతో దిశ లాంటి ఘటనలు జరగటం పెద్ద వింత కాదనేది విశ్లేషకుల వాదన. నిత్యం రక్షణ ఉండాల్సిన నగరాలలో ఇలాంటి బహిరంగ హత్యలు నేరగాళ్లను మరింత ప్రోత్సహించడమే అంటున్నారు విశ్లేషకులు. దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే నగరం భద్రతలేనిదిగా ముద్ర పడిపోతుందని, తద్వారా టూరిజం తగ్గిపోతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.


మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ: కుటుంబ రావు