ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆటలలో క్రికెట్ ఒకటి. అయితే ఈ ఆట దేశాల ఆటగాళ్ల ప్రవర్తన బాగుంటుంది ఒక్క బంగ్లాదేశ్ జట్టు తప్ప. తమ అనుచిత ప్రవర్తనతో ఈ జట్టు ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉంటుంది. 2016 టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పై విజయం సాధించకముందే సంబరాలు చేసుకోవడం అలాగే 2018 లో జరిగిన టోర్నీలో శ్రీలంక పై ఒక్క మ్యాచ్ గెలిచినందుకు నాగిని డ్యాన్స్ చేయడం ఇలా ఈ జట్టు చేసిన పనులు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి అలాంటి ప్రవర్తన తోనే వార్తల్లోకి వచ్చారు ఈ జట్టు ఆటగాడు. ప్రస్తుతం బంగ్లా లో జరుగుతున్న టీ20 లీగ్ లో సీనియర్ వికెట్ కీపర్ ముష్ఫిఖర్ రహీం తన జట్టు ఆటగాడిని కొట్టడానికి చూసాడు. అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాడు కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకోవడానికి రహీం అలాగే మరో యువ ఆటగాడు ప్రయత్నించారు. ఆ సమయంలో క్యాచ్ అందుకున్న రహీంకు ఆ మరో ఆటగాడు డ్యాష్ ఇచ్చాడు. దాంతో ఆ యువ ఆటగాడి పైకి చేయి లేపాడు రహీం. ఆ తర్వాత మిగిత ఆటగాళ్లు వచ్చి అతడిని ఆపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో యువ ఆటగాళ్లకు ఏదైనా సరే నేర్పించాలి కానీ ఇలా చేయడం తప్పు అని రహీం పై విమర్శలు వస్తున్నాయి.
previous post
భావితరాల సంక్షేమం కోసం జగన్ కృషి: మంత్రి బొత్స