ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 87,756 శాంపిల్స్ పరీక్షించగా 6617 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 57 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,23,856 కి చేరగా.. యాక్టివ్ కేసులు 71,466 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 17,40,281 కరోనా నుంచి కోలుకోగా 12,109 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2 ,00,34,279 కు చేరింది.
							previous post
						
						
					


మహారాష్ట్ర గవర్నర్ వ్యవహారంపై సోనియా అసంతృప్తి