యాంకర్, నటి అనసూయ తన పుట్టినరోజును నిన్న జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నెటిజన్లతో లైవ్‌లో మాట్లాడారు. తన గురించి, తన డ్రస్ గురించి అసభ్యకరంగా మాట్లాడిన నెటిజన్ను లైవ్‌లోనే ఏకిపారేసింది. ఈ సందర్భంగా హీరోలలో తను మొదటిగా ఇష్టపడింది ఎవరినో తాజాగా అనసూయ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. భారీ చిత్రాల దర్శకుడు, దక్షిణాది దర్శక దిగ్గజం శంకర్ తీసిన మొదటి చిత్రం ‘జెంటిల్‌మేన్’. ఆ సినిమా అంటే ఎంతో ఇష్టమని చెప్పిన అనసూయ, ఆ చిత్రం చూసిన తర్వాత నుంచి యాక్షన్ కింగ్ అర్జున్‌కి వీరాభిమానిగా మారిపోయానని చెప్పింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ చిత్రం చూసిన తర్వాత నాకు ఆయనంటే క్రష్ ఏర్పడిందని తెలిపింది. అప్పట్లో ఆయనంటే అంత ఇష్టం ఉండేదని అనసూయ పేర్కొంది. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ఎందరికో ఆమె సహాయం అందించింది. అన్ని క్వాలీటీస్ ఉన్న అనసూయ బుల్లితెరపైనే కాకుండా.. ఇప్పుడు వెండితెరపై కూడా తన ప్రతాపం చూపిస్తుంది. బాలీవుడ్లో కూడా తనకేదో అవకాశం వచ్చినట్లుగా ఇటీవల వార్తలు వినిపించాయి.
							previous post
						
						
					
							next post
						
						
					


“మా” ఎన్నికలు : శివాజీ రాజా పనితీరుతో అసంతృప్తి – నరేష్