telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

ఐసీఐసీఐ ఎటిఎం నుండి కార్డు లేకుండానే.. నగదు తీసుకోవడం ఎలా..

card less money withdraw from icici bank atm

ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ కార్డు లేకుండానే ఎటిఎం నుంచి నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల ఏటీఎం కేంద్రాలలో రూ.20 వేలకు మించకుండా కార్డ్ లేకుండానే నగదును తీసుకోవచ్చునని తెలిపింది. ఐమొబైల్ (iMobile) యాప్ నుంచి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఈ కార్డ్‌లెస్ ఉపసంహరణ సేవలను వినియోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ సేవలను మంగళవారం నాడు ప్రారంభించింది. రోజుకు రూ.20,000 ఈ పద్ధతి ద్వారా తీసుకోవచ్చు. ఐమొబైల్‌కు విజ్ఞప్తి ద్వారా దేశంలోని పదిహేను వేల ఏటీఎం కేంద్రాలలో ఈ నగదు తీసుకోవచ్చు. ఇది అత్యంత సులువైన, సౌకర్యవంతమైన మార్గమని ఐసీఐసీఐ తెలిపింది.

* కార్డ్‌లెస్ విత్‌డ్రా ప్రయోజనాలు : భారత దేశంలో ఏ ప్రాంతంలో అయినా 24X7 ఈ రిక్వెస్ట్, క్యాష్ విత్ డ్రా సదుపాయం అందుబాటులో ఉంటుంది. క్యాష్ విత్ డ్రా చేసుకునే వారు ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయి ఉండవలసిన అవసరం కూడా లేదు. ఏటీఎం కార్డు లేకుండానే క్యాష్ తక్షణమే పొందవచ్చు. అన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం నెట్ వర్క్ నుంచి ఈ ఉపసంహరణ అందుబాటులో ఉంది. ఇది సురక్షిత ప్రాసెస్.

* ఎలా విత్ డ్రా చేసుకోవాలి : ఐసీఐసీఐ మొబైల్ యాప్ iMobile కు లాగిన్ కావాలి. Services ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం Cash Withdrawal at ICICI Bank ATM సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు రిఫరెన్స్ OTP వస్తుంది. ఏ ఐసీఐసీఐ బ్యాంకుకు అయినా వెళ్లి కార్డ్‌లెస్ ఉపసంహరణను సెలక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిఫరెన్స్ OTPని ఎంటర్ చేయాలి. టెంపరరీ PIN ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు తీసుకోవాలనుకున్న అమౌంట్ ఎంటర్ చేయాలి. క్యాష్ విత్ డ్రా రిక్వెస్ట్, ఓటీపీ నెక్స్ట్ డే మిడ్ నైట్ వరకు వ్యాలిడ్‌గా ఉంటుంది.

మీకు సమీపంలో ఏటీఎం ఎక్కడ ఉందో తెలియకుంటే.. ఐసీఐసీఐ ఏటీఎంను గుర్తించేందుకు ఎస్సెమ్మెస్ చేస్తే సరిపోతుంది. ATMCC <> to 9222208888 కు ఎస్సెమ్మెస్ చేస్తే చాలు.

Related posts