బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా దూసుకెళ్తోంది అనసూయ భరద్వాజ్. తన గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది ఈ బ్యూటీ. “రంగస్థలం”లో రంగమ్మత్త లాంటి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన బర్త్‌డే సందర్భంగా కీసర మండలంలోని 100 మంది గర్భిణి స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్‌ని పంపిణీ చేశారు. అందరిని ప్రేమగా పలకరిస్తూ అనసూయ ఈ పంపిణీ చేపట్టడంతో వారందరు మురిసిపోయారు. కీసరలోని చీర్యాల ప్రాంతంలో ఉన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు. బుల్లితెరకి గ్లామర్ అద్దిన అందాల బ్యూటీ అనసూయకి అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. రంగమ్మత్తగా పాపులర్ పొందిన ఈ నటి ప్రస్తుతం చిరు ఆఛార్య చిత్రంతో పాటు కృష్ణవంశీ “రంగమార్తాండ” చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక అనసూయకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
previous post
“మా” ఎన్నికలు : శివాజీ రాజా పనితీరుతో అసంతృప్తి – నరేష్