బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.యూత్ అంతా ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అటు అఖిల్ కూడా ఈ సినిమా తన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు . నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లిరికల్ సాంగ్ విశేష ఆదరణ పొందాయి. ఈ సినిమా జూన్ 19న విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ కోసం అఖిల్ ఎంతగా ఎదురు చూస్తున్నాడో.. అల్లు అర్జున్ కూడా అంతలానే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయాలనీ బన్నీ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అవుతుందా.. లేక ఫట్ అవుతుందా అనేది.
previous post

