telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపు తెలంగాణలో మద్యం షాపులు బంద్‌

liquor shops ap

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రేపు దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను పాటించనున్నారు. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూకు మద్దతుగా రేపు తెలంగాణ వైన్‌ షాపులు బంద్‌ పాటించనున్నాయి. తెలంగాణ వైన్‌ డీలర్లు స్వచ్ఛందంగా తమ మద్దతును ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను రేపు మూసివేస్తున్నట్లు తెలంగాణ వైన్స్‌ డీలర్స్‌ అసోషియేషన్‌  ప్రకటించింది. మొత్తం 2,400 వైన్‌ షాపులు రేపు బంద్‌ పాటించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 700 బార్‌ షాపులు బంద్‌ అయినట్లు ఆయన పేర్కొన్నారు.

భారతీయులు సిద్ధంగా ఉండాలని మోదీ జాతినుద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే. రేపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పేరుతో స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరారు. అందరూ ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని కోరారు.

Related posts