telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్…

వైసీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాజధానిలో అసైన్డ్ భూముల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు.. నోట్ ఫైళ్ల రూపంలో చంద్రబాబు చేసిన అక్రమాలకు సాక్ష్యాలున్నాయి.. అసైన్డ్ భూముల అక్రమాలకు సంబంధించి నోట్ ఫైళ్ల రూపంలో ఉన్న సాక్ష్యాలని అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పిస్తాం అన్నారు.. ఇక, ఏ దళితుడైతే చంద్రబాబు మోసం చేశాడని నా దగ్గరకు వచ్చాడో… అతన్ని టీడీపీ భయపెట్టి అనుకూలంగా చెప్పించుకుందని ఆరోపించారు ఆర్కే.. మేమంతా అప్పట్లోనే దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించామన్న ఆయన.. పీవోటీ, పీవోఏ చట్టాలను అతిక్రమించి.. చంద్రబాబు ఏం చేసాడో స్టింగ్ ఆపరేషన్‌లో తేల్చామన్నారు. ఇప్పుడు స్టే మీద ఉన్నారు.. మళ్లీ కేసు వచ్చేసరికి ఏదో చేయాలని ఇన్ని డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఆర్కే.  నిజంగా ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని ఉంటే.. దళితులకు పెద్దపీట వేసి వారి భూములు వారికి ఉంచొచ్చు కదా.. అని ప్రశ్నించారు.

Related posts