కరోనా సెకండ్ వేవ్ లో భారత్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నా రాష్ట్రాలలో తమిళుడు కూడా ఒకటి. అయితే కరోనా పోరాటానికి తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు తాజాగా తల అజిత్ 25 లక్షల భారీ విరాళం ఇచ్చారు. అజిత్ కుమార్ నేరుగా బ్యాంకు బదిలీ ద్వారా 25 లక్షలను సిఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేశారు. ఇంకా సూపర్ స్టార్ రజినీకాంత్ రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇక ఇప్పటికే సూర్య, ఎఆర్ మురుగదాస్, ఉదయనిధితో సహా పలువురు తారలు కోవిడ్ సహాయక చర్యల కోసం తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలను ఇచ్చారు. సూర్య, ఎఆర్ మురుగదాస్, ఉదయనిధి… సిఎం ఎంకె స్టాలిన్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని చెక్కులను అందజేశారు. ఇతర కోలీవుడ్ ప్రముఖులు కూడా తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వబోతున్నారు. కరోనా రెండవ వేవ్ వ్యాప్తిని నియంత్రించడానికి సిఎం ఎంకె స్టాలిన్ తమిళనాడులో పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.
							previous post
						
						
					
							next post
						
						
					


అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్