telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీలో విషాదం..కరోనాతో ఎంపీ మృతి

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు.  తాజాగా బీజేపీ ఎంపీ నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహన్‌ గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇవాళ ఉదయం మృతి చెందారు. నంద్‌ కుమార్‌ మధ్యప్రదేశ్‌ ఖండ్వ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భోపాల్‌లో చికిత్స పొందుతున్న ఆయనను గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రికి తరలించారు. జనవరి 11న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చౌహాన్‌ గత కొన్ని రోజులుగా వెంటిలెటర్‌పైనే ఉన్నారు. తాజాగా ఆయన మృతి చెందారు. నంద్‌ కుమార్‌ మృతి పట్ల ప్రధాని మోడీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంతాపం తెలిపారు. కాగా.. ఆయన స్వస్థలం నిమార్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని షాపూర్‌. 1952లో ఆయన జన్మించారు. 1996లో షాపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేశారు.

Related posts