కోహ్లీ మైదానంలోకి దిగాదంటే పరుగుల వరద పారాల్సిందే. పిచ్, మైదానం ఏదైనా.. బౌలర్ ఎవరైనా అతడికి తెలిసింది మాత్రం రన్స్ చేయడం ఒక్కటే తెలుసు. ఇప్పటికే 70 సెంచరీలు, 22వేలకు పైగా రన్స్ చేశాడు. ‘గిల్లీ అండ్ గాస్’ పోడ్కాస్ట్ షో సందర్భంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, టిమ్ గోసేజ్ పలు విషయాలపై మాట్లాడారు. ఇదే షోలో టిమ్ పైన్ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి సానుకూల అంశాలు చెప్పమని పైన్‌ను గిల్లీ, గోసేజ్ కోరారు. ‘విరాట్ కోహ్లీ గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా మరోసారి చెపుతున్నా.. విరాట్ నీ సొంత జట్టులో ఉండటానికి ఇష్టపడే ఆటగాడిగా ఎప్పుడూ కనిపిస్తాడు. అతను పోటీదారుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అతడికి వ్యతిరేకంగా ఆడడం ఎంతో సవాలుగా ఉంటుంది. ఎందుకంటే విరాట్ గొప్ప ఆటగాడు. నాలుగేళ్ల క్రితం అతనితో గొడవ పడ్డాను. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’ అని పైన్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాతో టెస్టు సిరీస్ ఓటమిపాలవ్వడంపై గురువారం టిమ్ పైన్ స్పందించిన విషయం తెలిసిందే.
previous post