నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో వరం ప్రకటించింది. ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామన్నారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించామన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో మనబడి–మన బాధ్యత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. నెలలో 1, 3వ శనివారాలను నో బ్యాగ్ డేగా పాటించి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా బడిలో చేరిన విద్యార్థులందరికీ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..