telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పేద విద్యార్థుల‌కు స్కాలర్‌షిప్ ఇవ్వనున్న సోనూసూద్

Sonu-Sood

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. తాజాగా సోనూ తన ట్విట్టర్ లో పేద విద్యార్థుల‌ కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన‌ట్లు పేర్కొన్నాడు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకొంటున్నవారికి స్కాలర్ షిప్ లను ఇస్తానని వెల్లడించాడు. వైద్య విద్య‌, ఇంజినీరింగ్, బిజినెస్ స్టడీస్, జర్నలిజం వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నాడు. విద్యార్థులు తమ దరఖాస్తులను 10 రోజుల్లో [email protected] మెయిల్ కు పంపించాలని చెప్పాడు. అయితే దీనికి వార్షికాదాయం రెండు లక్షలకంటే తక్కువగా ఉండి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపాడు.

Related posts