వైసీపీ అధినేత వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్తో జగన్ జట్టుకట్టి హోదా సాధిస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చే డబ్బులే ముఖ్యమనుకుంటే అమరావతిని, పోలవరాన్ని కోల్పోతామని అన్నారు. .పోర్టు కోసం కేసీఆర్ ఏపీలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీపై కేసీఆర్ కక్షకట్టడం సమంజసం కాదని  శివాజీ అన్నారు. 
మాకు కులగజ్జి ఉందని,  కులగజ్జిని కేసీఆర్ ఆసరాగా తీసుకుంటున్నారన్నారు. జగన్ ఏ అర్హతతో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని నిలదీశారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బులను  ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలను బీజేపీలో కలుపుకునేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని  వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పారిపోయారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో 150 మండి క్రిమినల్స్ పోటీ చేస్తున్నారని శివాజీ చెప్పారు.



జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలే: సీపీఐ నారాయణ