నటుడు అరుణ్ విజయ్ వరుస విజయాలతో జెట్ స్పీడ్‌లా దూసుకుపోతూ, ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అరుణ్ విజయ్ రీసెంట్‌గా తన చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఆయన పార్ట్ పూర్తైన సందర్భంగా అరుణ్‌తో కేక్ కూడా కట్ చేయించింది చిత్ర బృందం. హార్డ్ వర్కింగ్ టీంతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్, సుజీత్, యూవీ క్రియేషన్స్, మిగతా చిత్ర బృందంతో సాగిన ఈ ప్రయాణం ఓ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
అద్భుతమైన అనుభూతి పోందడానికి ఆగస్ట్ 15 వరకు ఆగండి. ఆ రోజు మిమ్మల్ని అందరిని కలుస్తాను అని ఆ రోజు తన ట్విట్టర్ ద్వారా కామెంట్ పెట్టారు అరుణ్ విజయ్. ప్రస్తుతం తాను తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ మేరకు తన లుక్‌ని మార్చుకుంటున్నాడు. ఇందులో భాగంగా భారీ వర్కవుట్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూస్తుంటే అరుణ్ తన పాత్ర కోసం భాగానే హార్డ్ వర్క్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది.
#workoutmotivation Leg workout finisher! Lunges!! 💪 #AVworkoutVideos pic.twitter.com/E2ge5dtAiU
— ArunVijay (@arunvijayno1)


“సైరా”పై పూరీ కామెంట్స్… అన్నయ్యను కొట్టేటోడు మళ్లీ పుట్టడు…