టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కొంతకాలం క్రితం పవన్ జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎందుకనో ఆమె సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. అయితే రీసెంట్‌గా “ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ.. లీడర్ కాలేడు” అంటూ ఆమె పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. “యాంగర్ ఈజ్ నాట్ పవర్” అని చాలా సింపుల్‌గా ట్వీట్ చేశారు. కానీ, దీనిలో అంతరార్థం చాలానే ఉంది. ఇసుక కొరత కారణంగా నాలుగు నెలలుగా సమస్యలు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ లాంగ్ మార్చ్ అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎప్పటిలానే ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా పూనమ్ కౌర్ సోమవారం పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘కోపం అనేది శక్తి కాదు’ అని అర్థమొచ్చేలా ఇంగ్లిష్‌లో ట్వీట్ చేశారు. ఎప్పటిలాగే ఆమె ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.
ANGER IS NOT POWER !!!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 4, 2019