telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై చర్యలు తప్పవు: చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

క్రమశిక్షణే టీడీపీకి బలం అని అలాంటి క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు ముఖ్య నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు అంతర్గత విభేదాలపై చర్చించారు.

‘క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీకి బలం. దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ఇకనుంచి వారానికి ఒకరోజు తప్పనిసరిగా కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటాను’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య బహిరంగంగా నడుస్తున్న వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారాన్ని తక్షణమే పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగిస్తున్నట్లు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు,ఎంపీ కేశినేని చిన్నిలను పిలిచి మాట్లాడాలని, వారి నుంచి పూర్తి వివరణ తీసుకుని తనకు నివేదిక సమర్పించాలని క్రమశిక్షణ కమిటీకి సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

తాను విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక స్వయంగా ఇద్దరితోనూ మాట్లాడతానని అప్పటిలోగా వివాదం సద్దుమణగకపోతే కఠిన చర్యలు ఉంటాయని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Related posts