అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ఏబీసీడీ”. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్ఫకులుగా వ్యవహరిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. బాలనటుడిగా మనకు సుపరిచితమైన భరత్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో “డ్యాడ్.. నువ్వు స్వయంకృషిలో చిరంజీవిలా ఫీలవ్వకు. కష్టాల్లోకి తోసేస్తే మారిపోతానని అనుకోకు. నేను రిచ్‌గానే పుట్టాను, రిచ్‌గానే పెరిగాను, రిచ్‌గానే ఉంటాను” అంటూ హీరో చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. అమెరికాలో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి భారత కి వచ్చి మధ్య తరగతి వ్యక్తిగా జీవించలేక ఎలా ఇబ్బంది పడతాడనే కాన్సెప్ట్ ని కామెడీ యాంగిల్ లో చూపించాడు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా ?… : బాలకృష్ణ