పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై హాకీ నేపథ్యంలో రూపొందుతున్న ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీలో సందీప్ కిషన్- లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో ఇద్దరూ కూడా హాకీ ప్లేయర్స్‌గా కనిపించనుండటం విశేషం. అయితే ఇప్పటిదాకా తన సినిమాల్లో సాధారణ శరీరాకృతితో కనిపించిన సందీప్ కిషన్.. ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారాడు. ఈ క్రమంలో తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేశాడు. ఇది చూసి హీరోయిన్ లావణ్య వెంటనే ”ఎ1 ఎక్స్‌ప్రెస్ మూవీలో సందీప్ కిషన్‌తో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేశా” అని పేర్కొంది. దీంతో ఆమె చేసిన ఈ సరదా కామెంట్, సందీప్ న్యూడ్ లుక్ నెట్టింట తెగ హంగామా చేస్తున్నాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రం లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. అతిత్వరలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ క్లైమాక్స్ భారీగా చిత్రీకరించనున్నారట. హాకీ మ్యాచ్ మీదే ఈ క్లైమాక్స్ మొత్తం నడవనుందట. ఈ షూట్ కోసం మొహాలీలోని హాకీ స్టేడియం ఎంచుకున్నారట దర్శకనిర్మాతలు.
Touchwood and thank you sandeep, had so much fun working on #A1express
Totally enjoyed playing this powerful character. https://t.co/IbExGKxpdi— LAVANYA (@Itslavanya) September 18, 2020
నేను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారు: బండ్ల గణేశ్