కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని విచారించిన సీసీబీ పోలీసులు వారిద్దరి కాల్స్‌డేటా, వాట్సాప్ సందేశాలను సేకరించారు. ఈ డేటా విశ్లేషణ ద్వారా వారిద్దరికి అనేకమంది ప్రముఖులతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఈకేసులో నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆమెను బెంగుళూరు లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే రాగిణి తన ఆస్తులను ఆదాయపు పన్నుల శాఖ ఎక్కడ జప్తు చేస్తుందోనన్న భయంతో యలహంకలోని తన అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు అపార్ట్మెంట్ కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. ఈ ఇంటిని కొనుగోలు చేస్తే రానున్న రోజుల్లో చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయోమోనని కొందరు భయపడుతున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరుణంలోనే రాగిణి మెడకు డ్రగ్స్ వ్యవహారం చుట్టుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్‌కు షూటింగ్ నిమిత్తం వెళ్లిన రాగిణి కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధర్‌రావును భేటీ అయ్యారు. తక్షణం పార్టీలో ఎలాంటి పదవులు వద్దని ఒక సామాన్య కార్యకర్తగా సేవలందిస్తానని రాగిణి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాగిణిని పార్టీలోకి చేర్చుకొని బీబీఎంపీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆమె సేవలను వినియోగించుకోవాలని పలువురు నేతలు భావించారు. ఇంతలోనే డ్రగ్స్ వ్యవహారంలో ఆమె అరెస్ట్ కావడంతో ఈ నేతలంతా సైలెంట్ అయినట్లు సమాచారం. ఇక ఇదే కేసులో మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్ రంకా, లూమ్ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. వారందరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే సంజనకు మాత్రం 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు.
next post


అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్