telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీవారి దర్శనానికి టికెట్ల కోటా పెంపు

Tirumala

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు 9 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అందిస్తున్న సంగతి తెలిసిందే. భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి దర్శనానికి నేటి నుంచి రూ.300 దర్శనం టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. గంటకు వంద టికెట్ల చొప్పున ప్రస్తుతం రోజుకు 1000కి పైగా టికెట్లను ఆన్‌లైన్లో అదనంగా కేటాయించనుంది.

కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం భాద్రపద పౌర్ణమి సందర్భంగా బుధవారం తిరుమల ఆలయంలో శ్రీవారికి గరుడ సేవ నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి స్వామివారికి గరుడ సేవ చేయడం ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. రంగనాయక మంటపంలో శ్రీ మలయప్పస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించారు.

 

Related posts