telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాపీ వివాదంలో “ఆచార్య”

Aacharya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమా మోషన్ పోస్టర్‌ని తన కథ నుంచి కాపీ కొట్టారంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే యువ రచయిత ఆరోపిస్తున్నారు. 2006 సంవత్సరంలో తానూ పుణ్యభూమి అనే టైటిల్‌తో ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా వెల్లడించాడు. అయితే అందులో నుంచే ఆచార్య మోషన్ పోస్టర్‌లో ధర్మస్థలి అనే ఎపిసోడ్‌ తన స్క్రిప్ట్‌ నుంచి తీసుకునన్నారని అయన ఆరోపిస్తున్నారు. ఇక దీనిపైన ఆచార్య టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.. ఇక గతంలోనూ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం కూడా కాపీ అంటూ ఓ రచయిత ఆరోపణలు చేశాడు.

Related posts