మలేషియాలో పహంగ్లోని టెమర్లోహ్ ప్రాంతానికి చెందిన నేరో అనే మహిళ గుమగులాడే మటన్ కర్రీని తయారు చేసేందుకు సిద్ధమైంది. పెద్దగా ఉన్న ఒక ముక్కను చిన్న చిన్న ముక్కలు చేసేందుకు చాప్పింగ్ బోర్డు మీద పెట్టింది. అంతే.. అది ప్లీజ్ నన్నేమీ చేయొద్దు అన్నట్లుగా కదిలింది. గుండె కొట్టుకున్నట్లుగా ఊగిన ఆ మాంసం ముక్కను చూసి ఆ మహిళ షాకైంది. ఈ అరుదైన ఘటనను ఆమె కుమార్తె మొబైల్ కెమేరాలో బంధించింది. ఆ వీడియోను ట్విట్లర్లో పోస్టు చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే మాంసాన్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత కూడా తాజా మాంసంలోని నరాల్లో ఇంకా జీవం ఉంటుంది. అందుకే అవి అలా కదులుతుంటాయని అంటున్నారు నిపుణులు.
GUYS KENAPA DAGING KORBAN NI GERAKKKKKK
Mak aku taknak masak sebab takut 😂 pic.twitter.com/XRma8VIUqH
— Yo! Artist (@tterororo) July 31, 2020
లవ్ లో పడితే ఏం చేస్తావు ? అన్నారు… “బిగ్ బాస్”పై మాధవీలత సంచలనం