telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వంటగ్యాస్ క‌స్ట‌మ‌ర్ల‌కు షాక్…స‌బ్సిడీ డ‌బ్బులు నిలిపివేత!

cooking gas price hiked by govt

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సర్కార్ షాకిచ్చింది. గ‌త మూడు నెల‌లుగా క‌స్ట‌మ‌ర్ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీ డ‌బ్బులు జ‌మవ్వ‌డం లేదు. 2020 మే నెల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వారికి సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో ప‌డ‌టం లేదు. మే నెల నుంచి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ సబ్సిడీ డబ్బులను నిలిపివేసింది.

గత సంవ‌త్స‌ర‌ కాలంలో సబ్సిడీ లేనటువంటి గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల రేటు పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు సబ్సిడీ సిలిండర్, సబ్సిడీ లేనటువంటి సిలిండర్ ధరలు దాదాపు లెవ‌ల్ అయ్యాయి. అందుకే మోడీ స‌ర్కార్ సబ్సిడీని బంద్ చేసింది. ఇకపోతే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ సాధారణంగా ఏడాదిలో ప్రతి ఫ్యామిలీకి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే.

Related posts