జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. కాపు నేస్తం పథకంపై చెడుగా ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రిజర్వేషన్ డిమాండ్ నుంచి కాపుల దృష్టి మరల్చేందుకే నిధుల విడుదల అంటూ పవన్ వ్యాఖ్యలపై మంత్రి బదులిచ్చారు. జగన్ అంటే నచ్చదు కాబట్టే పవన్ అలాంటి విమర్శలు చేస్తుంటారని వ్యాఖ్యానించారు. పవన్ తన ప్రెస్ నోట్ లో జగన్ రెడ్డి అని రాస్తుంటారని, కులం దాచిపెడితే దాగేది కాదని అన్నారు.
చంద్రబాబు పట్ల ప్రేమను పవన్ దాచుకోలేకపోతున్నారని అన్నారు. నాడు ముద్రగడను పచ్చిబూతులు తిట్టినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని కన్నబాబు ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు చేసిన మోసం పవన్ కు కనబడలేదా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ కళ్లకు చంద్రబాబు ఓ ప్రపంచ సంస్కర్తగా కనిపిస్తారని ఎద్దేవా చేశారు.


మోదీ, యోగిల డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల ఘర్షణలు: మాయావతి