మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యానారాయణ కారు డ్రైవర్ సన్యాసినాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లాలోని పరవాడ మండలం కలపాకలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తానెందుకు చనిపోతున్నదీ వివరిస్తూ బంధువులకు ఆడియో మెసేజ్ పంపాడు. ఇంటి నిర్మాణానికి అడ్డుతగులుతూ వలంటీర్ నరసింగరావు వేధిస్తున్నాడంటూ ఆడియోలో తన గోడును వెల్లడించాడు.
సన్యాసినాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.