telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెడ్ : “డింఛక్…” మాస్ సాంగ్ గ్లింప్స్

Red

ఈరోజు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ గ్లింప్స్ ‘డింఛక్..’ వీడియోను విడుదల చేసింది. ‘రెడ్’ మూవీలోని పాటల్లో తనకు నచ్చిన ఓ సాంగ్ ఇది అని రామ్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా, స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో నివేథా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రామ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రామ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు రామ్ నటిస్తున్న “రెడ్” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మీరు కూడా “డింఛక్..” సాంగ్ టీజర్ ను వీక్షించండి.

Related posts