తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ తెలుగు, మలయాళంలో కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపై తల్లి పాత్రలు చేయనని నటి ఐశ్వర్య రాజేశ్ స్పష్టం చేశారు. పలు సినిమాల్లో ఆమె తల్లిగా, చెల్లిగా కనిపించారు. మరికొన్ని సినిమాల్లో ఐశ్వర్య హీరోయిన్గా నటించారు.అయితే ఐశ్వర్య తల్లి పాత్రలో నటించడంతో పలువురు యంగ్ హీరోలు ఆమెతో నటించేందుకు ఒప్పుకోవడంలేదట. దీంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని వెల్లడించారు. కాగా తెలుగులో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో పాటు ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో నటించారు.
previous post
next post