అలీ, నియా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘మా గంగానది’ ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ఉపశీర్షిక.రవికుమార్ సమర్పణలో మూగాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.బాల నాగేశ్వరరావు దర్శకత్వంవహిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ కుమార్తె బేబీ జువేరియా నటించడం విశేషం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో హీరో అలీ మాట్లాడుతూ శ్రీనివాస్‌గారు, ఆయన శ్రీమతిగారు మంచి ఆశయంతో ఈ ట్రస్ట్‌ను నడిపిస్తున్నారు. డబ్బు చాలా మంది దగ్గర ఉండొచ్చు కానీ.. పదిమందికి సాయపడాలనే గుణం కొంత మంది దగ్గరే ఉంటుంది. ఆ మనసు శ్రీనివాస్‌గారు, ఆయన శ్రీమతిగారికి ఆ భగవంతుడు ఇచ్చారు. ఈ సినిమా నాది 1109వ సినిమా. ఈ ముగాంభికా బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం ‘మా గంగానది’.. భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలపై రాసిన అద్భుతమైన కథ. బాల నాగేశ్వరరావుగారు మంచి వ్యక్తి. బాగా చదువుకున్నారు. సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తి. స్త్రీలకు సంబంధించిన కథతో రూపొందించారు అన్నారు.