telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

అక్కడ జైళ్లే.. వాళ్లకు వృద్ధాశ్రమాలు..

japan old aged commits more crimes

సాధారణంగా ఆవేశంలో తప్పులు చేసి, జైలు పక్షులుగా మారిపోతుంటారు కొందరు. అలాంటివారు పశ్చాత్తాపం పొంది, ఎప్పుడెప్పుడు సాధారణ జీవితంలోకి వెళ్తామా అని ఆశపడుతుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. అసలు జైల్లోకి వెళ్ళడానికే ఇక్కడి వారు తప్పులు చేస్తారు. ఏమంటే అక్కడ సమయానికి అన్ని అందుతాయని. అలా ఎందుకంటే, వాళ్ళు ముసలి వాళ్ళు కాబట్టి. వాళ్ళ కుటుంబంలో అందరూ ఊళ్ళు పట్టి పోయారు, వాళ్ళను చూసుకోవడానికి ఎవరు లేరు.. దానితో ఏమి చేయాలో తెలియక, ఏదో ఒక తప్పు చేసి జైలుకు వెళ్తున్నారు.

జపాన్ దేశానికి చెందిన వృద్ధులు, చేతికి అంది వచ్చిన కొడుకు చేయి పట్టుకుని నడిపిస్తాడనుకుంటే ఉద్యోగాల నిమిత్తం దూరంగా వెళిపోతున్నారు. ఫలితంగా పెద్దవాళ్లు ఒక్కరే ఒంటరిగా ఇళ్లలో మిగిలి పోతున్నారు. పలకరించే వాళ్లు లేక, పట్టించుకునే వాళ్లు లేక నేరాలకు పాల్పడుతూ జైలుకు వెళుతున్నారు. అక్కడ నలుగురి మధ్యలో ఉంటాం.. వేళకు ఇంత పెడతారు అది తిని పడుకుంటాం. ఈ వయసులో ఇంతకంటే కావలసింది ఏముంటుంది అని అంటున్నారు.

japan old aged commits more crimesaమొత్తం 13 కోట్లు జనాభా ఉన్న జపాన్ లో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధుల సంఖ్య 12 శాతానికి పైగా ఉంది. మరణాల రేటు తగ్గడంతో వయసు పైబడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. వీరికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కూడా అంతంత మాత్రమే. దీంతో దొంగతనాలు చేసి, కత్తులతో బెదిరించి నేరాలు చేస్తూ పట్టుబడి మరీ జైలుకు వెళుతున్నారు.

ఈ విషయంలో జపాన్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతోంది. గత ఏడాది చివరి వరకు జైళ్లలో ఉన్న ఖైదీల్లో 18 శాతం 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఉన్నారని తెలిసింది. కనీచీ యెముడా అనే వృద్ధుడు 85 ఏళ్ల వయసులోనూ 20వ సారి నేరం చేసి జైలుకు వెళ్లేందుకు సిద్ధపడడం చూస్తుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి మరింతగా దిగజారకుండా ఉండేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. నిజంగా వృద్ధాప్యం ఎంత శాపమో అనిపిస్తుంది కదా.

Related posts